ఢిల్లీ లో మిమ్మల్ని నిలదీస్తా..! చీల్చి చెండాడిన బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసినా హింసలు చేసినా ప్రజలు తనని కుటుంబ పెద్దలా భావించి ఓటు వెసైనందుకు వారికి అభినందనలు తెలియజేశారు. ఇక నిన్న జరిగిన ఎన్నికల్లో ఈవిు‌ఎం లు మొరాయించిన విషయం తెలిసిందే జనాన్ని గనతల తరబడి క్యూ లైన్ లలో నిలుచోబెట్టినందుకు గాను గతం లో ఈసీ జోక్యం చేసుకొని అధికారులను బదిలీలు చేసినందుకు గాను ఈసీ పై బాబు మండి పడ్డారు.. తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. 4583 పోలింగ్ సెంటర్లలో ఈవీఎంలు మొరయించాయని అఫీషియల్ గా వచ్చిన సమాచారం అని ఆయన తెలియజేశారు. రాష్ట్రం లో పలు చోట్ల ఈవిఫ‌ఎం లు మొరాయించాయని వాటి వివరాలను మీడియా ముందు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ అధికారే ఓటు వెయ్యలేకపోతే సాధారణ పౌరులు ఎలా ఓటు వేస్తారు..? ఈవీఎంలు రిపేర్ చేసేవారిని ఎవ్వరు అపాయింట్ చేశారు..? ఎవ్వరి అనుమతితో ఈవీఎంలు టెక్నీషియన్లను నియమించారు..? అనే ప్రశ్నలని ఆయన లేవదీశారు. ఈవిఎం, వివిఫ్యాట్ లపై మాకు అనుమానాలు ఉన్నాయని ముందుగానే చెప్పా. ఎన్నికల కమిషన్ ఎవ్వరి ఆధీనంలో నడుస్తుందో ప్రజలకు తెలియాలి అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్ కు ఎన్నికల పట్ల కమిట్మెంట్ లేదు..! ఏపీలో ఎవరిని అడిగి చీఫ్ సెక్రటరీని మార్చారు..? అని ఆయన ధీటుగా స్పందించారు.

మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి 5 ఏళ్ళు కష్ట పడ్డ మమ్మల్ని బలిచేస్తారా అంటూ ఈసీ ని నిలదీశారు. ఈవిఎంల వల్ల 3 గంటల సమయం వృధా అయింది దానికి ఎవ్వరు సమాధానం చెప్తారు. ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ను నిలదీస్తా..! అంటూ ఆయన తెలియజేశారు. ఎన్నికల కమిషన్ తప్పులు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంధులు పడ్డారు. అధికారుల బదిలీలల్లో ఎన్నికల కమిషన్ ఎందుకు జోక్యం చేసుకుంది. సీఎస్, ఇంటలిజెన్స్ అధికారులను ఎవరిని అడిగి బదిలీ చేశారో ఈసీ సమాధానం చెప్పాలి అని ఆయన అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా. సీఎం నివాసం ఉండే నియోజకవర్గంలో 30శాతం ఈవీఎంలు పని చేయలేదు దీనిపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్తుందా…? అంటూ ఆయన నిలదీశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: