మంచి కథ..! మరోసారి మీ ముందుకొస్తాం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నాగ చైతన్య సమంత తొలిసారిగా ఏం మాయ చేసావె సినిమా తో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు, ఇక ఆ సినిమా తరువాత ఆటోనగర్ సూర్యలో కనిపించినా అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారు మళ్ళీ ఆపై మనం తో మరోసారి ప్రేక్షకులని మెప్పించారు తమ కరీర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. ఇక మనం సినిమాతో మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి ఆ తరువాతా మళ్ళీ చాలా రోజుల తరువాతా మజిలీ సినిమాతో మన ముందుకి వచ్చారు. పెళ్లి తరువాత వీరిద్దరు కలిసి చేసిన సినిమా మజిలీ. మజిలీ తో మంచి హిట్ అందుకున్నారు.

ఇది వరకే వీరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా కనిపించేది ఇక పెళ్లి చేసుకున్న తరువాత ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా లో నాగ చైతన్య సమంతా భార్య భర్తలు ఇక నిజ జీవితం లో భార్య భర్తలని చూపించినట్టే చూపెట్టాడు దర్శకుడు శివ నిర్వాణ. నేచురల్ యాక్టింగ్ తో సినిమాలో పర్ఫామెన్స్ అదరగొట్టారు. ఇక కథ నటన దర్శకత్వం బాగుండటం తో సినిమా కి మంచి కలెక్షన్స్ వచ్చాయి.. దీంతో సినిమా బయ్యర్లు కూడా లాభ పడ్డారు.

ఇప్పటికే మూడు సార్లు వీళ్ళ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ హిట్స్ కొట్టారు నాగచైతన్య సమంత ఇప్పుడు మరో సినిమాతో ముదుకు రావాలని నిశ్చయించుకున్నారు. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తామని సమంత తన సన్నిహితులతో చెబుతుందట. మంచి కథ తో మంచి స్క్రీన్ ప్లే తో వస్తే తప్పకుండా మరోసారి కలిసి నటిస్తారట. ప్రస్తుతం సమంత తన కెరీర్ లో మంచి ఫామ్ లో ఉంది తెలుగు లోనే కాకుండా వేరే భాషల్లోను తను నటిస్తుంది. ఈ ఏప్రిల్ లో తమిళ సినిమా సూపర్ డీలక్స్ తో మన ముందుకి రానుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: