వెండితెర పై మాయావతిగా..! బుల్లి తెరపై ఇందిరా గాంధిగా..!త్వరలో..

Google+ Pinterest LinkedIn Tumblr +

విద్యా బాలన్ బాలీవుడ్ నటి ఎన్నో చిత్రాలు చేసింది ఎన్నో అవార్డులు గెలుచుకుంది. తాజాగా ఆమె తెలుగు వారికి కూడా పరిచయం అయ్యింది. ఎన్టీఆర్ మహానాయకుడు కథనాయుడు సినిమాల ద్వారా విద్యా తెలుగు వారికి బాగా పరిచయం అయ్యింది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ విద్యా బాలన్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈమె చుట్టూ బయోపిక్ లు అలుముకున్నాయి. ఎన్టీఆర్ బైపిక్ లో తెలుగు లో ముఖ్య పాత్రలో నటించగా ఇప్పుడు ఈమె వద్ద రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రెండూ బయోపిక్ లే..!

గతంలో కూడా విద్యాబాలన్ సిల్క్ స్మిత పాత్ర లో దర్తి పిక్చర్ అనే సినిమాలో నటించింది ఆ సినిమాకి గాను ఆమెకి జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఇక అప్పటి నుండి కొంత గ్యాప్ తరువాత మళ్ళీ వరుసగా బయోపిక్ లలో నటిస్తుంది కానీ ఈసారి ముఖ్య పాత్రలు కాకుండా ప్రధాన పాత్రల్లో నటిస్తుంది. ఒక పాత్ర నేమో ముఖ్యమంత్రిగా మరో పాత్ర నేమో ప్రధానమంత్రిగా..! ప్రియతమా నాయకురాలు దివంగత ప్రధాని భారత మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రలో ఈమె కనిపించబోతుంది. ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తన భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్ తెరకెక్కిస్తున్న ఇందిరా గాంధీ బయోపిక్ వెబ్ సిరీస్ లో ఈమె ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తుంది. ఇక పోతే దేశంలో అత్యున్నత దళితనేతగా పేరొందిన ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత మయావతి బయోపిక్ లో ఆమె నటించనుందని సమాచారం. ఇప్పటి వరకైతే విద్యా బాలన్ తానే సవయంగా తన ఇంటర్‌వ్యూ లలో పేర్కొంది కానీ ఈ రెండు ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. మొత్తానికి వెండి తెర పై ముఖ్యమంత్రిగా బుల్లి తెర పై ప్రధానమంత్రిగా నటించబోతుంది ఈ బామా.. ఇక ఈ పాత్రల గురించి జిమ్ లో బరువు తగ్గించుకోడానికి తెగ కష్టపడుతుంది. త్వరలో అధికారిక ప్రకటన తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు.
IndiraGandhi and mayavati

Share.

Comments are closed.

%d bloggers like this: