పికే ని కలిసిన జగన్..! చర్చనీయాంశంగా మారిన భేటీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ అధినేత జగన్ తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కలిశారు. ఆయాని ఎంతో ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశాడు. హైదరబాద్ లోని ప్రశాంత్ కిషోర్ కార్యలయం అయిన ఐ‌ప్యాక్ లో జగన్ ప్రశాంత్ కిషోర్ ని కలవడం జరిగింది. అక్కడికి చేరుకున్న జగన్ ని ప్రశాంత్ కిశోర్ సాదరంగా ఆహ్వానించారు. ఇక ఇద్దరు దాదాపుగా గంటన్నర పాటు భేటీ అయ్యారు ఎన్నికల విషయాలు మరియు పలు అంశాలని గురించి వాళ్ళు చర్చించుకున్నారు.

ప్రశాంత్ కిషోర్ ఒక భారీ టీమ్ తో దాదాపుగా రెండేళ్ల నుండి జగన్ గెలుపు గురించి కష్టపడుతున్నాడు. ప్రశాంత్ కిషోర్ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆ తరువాత జగన్ కోరడంతో ప్రశాంత్ కిషోర్ ఈయనతో కలిసి పని చేస్తున్నారు. జగన్ పథకాలలో ప్రచారంలో ప్రసంగాలలో సహా చాలా విషయాల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచనా చేశాడు. మ్యానిఫెస్టో పై కూడా ప్రత్యేక శ్రద్ద వహించాడు. రాష్ట్ర వ్యాప్తంగా తన టీమ్ ని పెట్టి ఎప్పటికప్పుడు సర్వేలు తీయించి జగన్ రాబోయే కాలం లో ఏం చేస్తే బాగుంటుందో జనం జగన్ దేగ్గర నుండి ఏం ఆశిస్తున్నారో ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిశోర్ జగన్ కి తెలియజేస్తాడు.

గత నెల రోజులుగా ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏపీ లో తీవ్రంగా శ్రమించింది. రావాలి జగన్ కావాలి జగన్ క్యాంపెయిన్ కూడా ప్రశాంత్ కిశోర్ ఏ డిజైన్ చేసినట్టుగా సమాచారం. ఇక సాంజిక మాధ్యమాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ట్వీట్ లు పోస్ట్ లు పెడుతుంటాడు. ఇక పికే టీమ్ ని కూడా జగన్ కలిసి అభినందనలు తెలియజేశాడు. ఇద్దరూ కూడా జగన్ గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
jagan and pk at I-PAC hyderabad

Share.

Comments are closed.

%d bloggers like this: