శ్రీ సీతారాముల కళ్యాణం వైభోగమే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అలనాడు శ్రీ రాముడి అనన్య బక్తుడు అన్నమయ్య ఎంతో కష్టపడి భద్రాచల నిర్మాణం చేశాడు అప్పటినుండి ఆనవాయతిగా శ్రీ రామచంద్రుడి కళ్యాణం అంగరంగ వైభవమ్ముగా నిర్వహిస్తున్నారు. ఆరుబయట పందిరి భక్తులకి కన్నుల పండుగ. శతకోటి తలంబ్రాలు భక్తులకి ఆశీర్వాదాలు… శ్రీ రామచంద్రుడి వివాహ ఘట్టాన్ని తిలకించి తమ జీవితాల్ని చరితార్ధం చేసుకోడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. అంగరంగ వైభవముగా జరిగే సీతారాముల కళ్యాణం భక్తులకి కన్నుల విందు అనే చెప్పాలి.

భద్రాచలంలో నిన్న జరిగిన బ్రహ్మోత్సవ వేడుకల్లో శ్రీరామచంద్ర స్వామి ఎదుర్కొలు ఉత్సవం అద్భుతంగా జరిగింది. ఆ వేడుకని తిలకోయించిన భక్తుల ముఖాల్లో ఆనందపు వెలుగులు వెదజల్లాయి. ఆ వేడుకని కనులారా చూసేందుకు బక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేద పండితులు వధూవరుల వంశ విశిష్టతను వివరించి, సీతారాముల ఔన్నత్యాన్ని లోకానికి చాటిచెప్పారు. ఇక నేటి ఉదయం రెండు గంటలకి ఆలయాన్ని తెరిచి రాముల వారికి సుప్రభాత సేవ సేవలు నిర్వహించారు. ఆపై ఉదయం నాలుగు గంటలకి మూలవర్లకి అభిషేకం చేశారు. సీతమ్మని రామయ్యని చక్కగా అలంకరించి ఉదయం 8 గంటలకి ధృవమూర్తులకి కళ్యాణం నిర్వహించారు.

కాళ్యాణం నిర్వహించిన తరువాతా కళ్యాబ్న మూర్తులని అలంకరణ చేసి మిథిలా మందపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయమ 10.30 నుంచి 12.30 గంటల మధ్యా భక్తుల సమక్షం లో శ్రీ స్వామి వారి కళ్యాణం జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. శ్రీరామ నవమికి మరో విశిష్టత కూడా ఉంది, త్రేతాయుగం వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించగా, ఇదే రోజు సీతమ్మతో వివాహం జరిగింది. త్రేతాయుగం నాటికి అరుదైన ఘట్టాన్ని తలచుకుంటూ దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను నిర్వహిస్తారు. ఇదే సంధర్భంగా దేశ వ్యాప్తంగా శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

Share.

Comments are closed.

%d bloggers like this: