వైసీపీ వస్తే రాష్ట్రం రావణ కాష్టమే..!- బుద్దా వెంకన్న

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న విజయవాడ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు జగన్ పై ప్రధాని మోదీ పై ధీటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని పొగుడుతూ మోదీ జగన్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మోదీ ఒక శాడిస్ట్ అని రాష్ట్రంలో అలజడిలు పుట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించాడు.

ఆయన మాట్లాడుతూ.. మే 23వ తేదీన ఆంద్రప్రదేశ్ అభినవ రాముడి పట్టాభిషేకం జరగబోతుంది. తమ అధినేత మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ఆయన స్పష్టం చేశారు. దేశానికి ప్రధాని శాడిస్ట్ గా ఉన్నాడు. దేశ రాజకీయాలని ప్రభావితం చేయబోతున్న చంద్రబాబును చూసి బీజేపీ, వైసీపీ నేతలు భయపడుతున్నారు అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తొడ కొట్టి చెబుతున్నా ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతుంది అందరికీ మరోసారి మెరుగైన అధికారం మెరుగైన ప్రభుత్వం దక్కుతుంది అని ఆయన తెలియజేశారు.

మూడు గంటల పాటు ఈవీఎంలు పని చేయడం లేదని ప్రశ్నిస్తే టీడీపీపై ఆరోపణలు చేస్తారా..? రాష్ట్రంలో అలజడి సృష్టించాలని వైసీపీ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. కుట్రలు, కుతంత్రాలు చేసి రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చెయ్యాలని చూస్తున్నారు అని ఆయన బీజేపీ యైసీపీ ఆపై ఆరోపణలు చేశారు. స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తిపై పోలింగ్ స్టేషన్లో దాడి చేస్తారా…? ఎన్నికల ముందే అరాచకం సృష్టించారు అంటే వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టమే అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలని ఏపీ ఎన్నికలకు భద్రత కోసం ఎందుకు పంపలేదు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు లేని రక్షణ సాధారణ ప్రజలకు ఎక్కడ నుంచి వస్తుంది అని ఆయన ప్రశ్నించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: