నిక్ అలా అని నేను అనుకోలేదు..! ఏదైనా చేస్తాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత ఏడాది బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా హాలీవుడ్ నటుడు మరియు సింగర్ నిక్ జోనస్ వివాహం చేసుకున్నారు. ఇక అప్పటినుండి వాళ్ళు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు ఇక కోతకాలంగా మాత్రం ప్రియాంకా చోప్రా నిక్ జోనస్ ల వైవాహిక జీవితం పై పలు రూమర్స్ వస్తున్నాయి. ప్రియాంకా నిక్ జోనస్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయని అలా ఎన్ని గొడవలు జరిగినా మీడియా ముందు మాత్రం ఏమి జరగనట్టు నటిస్తున్నారని వార్తలొచ్చాయి. ఇక ప్రియాంకా వ్యక్తిత్వం నిక్ తల్లిదండ్రులకి నచ్చడం లేదని త్వరలో నిక్ ప్రియాంకా లు విడాకులు తీసుకుంటున్నారని అనేక రూమర్స్ వచ్చాయి ఒక ఆంగ్ల పత్రికలో కూడా కథనం వచ్చింది. ఇక అప్పటి నుండి ఈ వార్తా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ విషయం ఇలా ఉంటే ప్రియాంకా చోప్రా మాత్రం తాను చాలా హ్యాపీ గా ఉంటున్నానని వస్తున్న రూమర్స్ లో నిజం లేదని చెప్పుకొస్తుంది. అయితే తాజాగా ప్రియాంక న్యూయార్క్ లో జరిగిన 10వ అంతర్జాతీయ మహిళా వార్షికోత్సవ సదస్సులో యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ లో హాజరయ్యింది. ఇక అక్కడ ఆమె పిల్ల గురించి మాట్లాడింది వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్యల గురించి వాళ్ళకి ఎలా సహాయం అందించాలి అన్న విషయాలని ఆమె మాట్లాడింది. ఇక అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా అక్కడ ఆమె నిక్ గురించి తన అభిప్రాయాన్ని అడిగగా పెళ్లికి రెండేళ్ల ముందు నుండే నిక్ తనకు తెలుసనని, కానీ అతడిని పెళ్లి చేసుకుంటానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదని.. నిక్ విషయంలో తన అంచనా తప్పిందని చెప్పింది. నిక్ తో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అతడి గురించి ఎంత తపుగా ఆలోచించానో తెలుసుకున్నానని తెలిపింది. అన్ని విషయాల్లో అండగా నిలిచే భర్త దొరికాడని, తనకు ఎప్పుడు ఏం కావాలో చెప్పకుండా అర్ధం చేసుకుంటాడని వెల్లడించింది. చిన్నపిల్లలా తనేం కావాలని గొడవ చేసినా.. ఎక్కడున్నా తీసుకువచ్చి తన ముందు పెడతాడని నిక్ వ్యక్తిత్వం గురించి చెబుతూ మురిసిపోయింది. వస్తున్న రూమర్స్ అన్నీ తప్పని వాటిలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: