దేవుడు చెప్పాడు.. అందుకే చంపేశా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అమెరికాలో ఒక వ్యక్తి భార్య పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు.. అతనికి దేవుడిపై భక్తి ఎక్కువ. ఇక ఒకరోజు కలలో దేవుడు కనిపించి తన భార్య మంచిది కాదని అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పాడు ఇక అంటే మర్నాడు తెల్లవారగానే తీవ్ర ఉద్వేగానికి లోనై తన భార్యని ఎందుకలా చేశావ్ అని గట్టిగా రోదిస్తూ షూట్ చేసి చంపేశాడు అంతటితో ఆగకుండా పిల్లల్ని చంపేశాడు ప్రియుడి గురించి వెతుకుతూ రోడెక్కాడు చూసిన స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేయగా అతనిని అదుపులోకి తీసుకున్నారు.. కటకటాల మధ్య ఉచ్చులు లెక్కపెడ్తున్నాడు. స్థానికంగా ఈ వార్తా సంచలనాన్ని క్రియేట్ చేసింది.

వివరాల్లోకి వెళితే అమెరికాకి చెందిన ఆస్టిన్ స్మిత్ అనే వ్యక్తి అమేక లోని ఆరిజోనాలో భార్య పిల్లలతో నివాసముంటున్నాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్మిత్ కి దేవుడి పై నమ్మకం ఎక్కువ. ఎప్పుడూ ప్రార్ధనలు చేస్తూనే ఉంటాడు ఇక చాదస్తం ఎక్కువైనట్టు ఉంది. ఒకరోజు అతను నిదురిస్తుండగా దేవుడు కలలోకి వచ్చాడు. నీ భార్య ఇలాంటిది? అంటూ ఎన్నో తనకి తెలియని విషయాలు చెప్పాడు ఇక అంతే.. మర్నాడు తెల్లవారు లేవగానే స్మిత్ తన రివాల్వర్ తోటి తన భార్యపై ఏనుకిలా చేశావ్ నాకు అంతా తెలిసిపోయింది దేవుడు అంతా చెప్పేశాడు అంటూ తనని దారుణంగా రివాల్వర్ తో కాల్చి చంపేశాడు.

అమ్మను తండ్రి దారుణంగా చంపడం చూసిన వారి ఏడేళ్ల కూతురు ఏడవడం మొదలెట్టింది. అంతే కోపంతో ఆమె ఎత్తి సీలింగ్‌కేసి కొట్టి చంపేశాడు. తండ్రి చేస్తున్న దారుణ కాండను కళ్లారా చూసిన ఐదేళ్ల కొడుకును కూడా అలాగే కొట్టాడు. తండ్రి ఏం చేస్తున్నాడో తెలియకపోయినా అతని వాలకాన్ని చూసి భయపడిన మూడేళ్ల కూతురు… భయంతో వెళ్లి మంచం కింద దాక్కుంది. ఇక మూడో పసికందు కోసం వెతికినప్పటికీ కనిపించకపోయేసరికి అందరూ మరణించారాలేదా అని నిర్దారించుకున్నాడు.

ఇక తన ప్రియుడి గురించి వెతుకుతూ వెతుకుతూ.. ప్రియుడి ఇంటికి చేరుకున్నాడు. ప్రియుడి ఇంటి తలుపులు గట్టిగా బాదడంతో ప్రియుడి సోదరుడి తమ్ముడు బయటకి వచ్చి ఎందుకలా బాదుతున్నావ్ ఏం కావాలి అని అడిగాడు. ప్రియుడి గురించి అడగగా అతడు లేదు అని చెప్పడంతో ప్రియుడి సోదరుడిని కూడా దారుణంగా కాల్చేశాడు. ఇక ప్రియుడి ఆచూకీ గురించి వెతుకుతూ అలాగే రోడ్డు పై వెతుకుతూ వెళ్ళాడు తన వద్ద గన్ ఉండటం చూసి ఎవరో స్థానికుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు తన కారు లో మూడు రివాల్వర్ లని పోలీసులు స్వాదీనమ్ చేసుకున్నారు. అతనిని విచారించగా నిజాలు బయట పెట్టారు ఘటనా స్థలనికి వెళ్ళి చూసిన పోలీసులు కంగు తిన్నారు. ఎందుకు చేశావ్ అని నిలదీయగా దేవుడు చెప్పాడు అని వింత సమాధానాలు ఇచ్చాడు. వివరాలు సేకరించి ఆ నిందితుడి పై మూడు హత్య కేసులు ఒక హత్యాయత్నం కేసు నమోదు చేసి జయలుకి తరలించారు. మంచం కింద దాచుకున్న ఆ చిన్నారిని చైల్డ్ కేర్ సెంటర్ లో పెట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: