కర్నాటకలో బాబు రోడ్ షో..! నేనోస్తున్నా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కర్ణాటకలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మాండ్యా నియోజకవర్గం. ఎందుకంటే అక్కడ జరగబోయే పోటీ అలాంటిది మాంద్యా నియోజకవర్గం శాసనసభ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు దివంగత నటుడు అబరీష్ భార్య సుమలత.. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్ పోటీలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులకి రాజకీయ అనుభవం ఏమి లేదు.. ఇద్దరు నటులే ఇద్దరు ఇదే ఎన్నికల్లో రాజకీయ ఆరంగేట్రం చేశారు.

సుమలత స్వంతంత్ర అభ్యర్థిగా దిగినప్పటికీ ఆమెకి అక్కడ మంచి అనుకూలత లభిస్తుంది. కర్నాటక ప్రతిపక్ష నేత యడ్యూరప్ప కూడా సుమలతకే మద్దత్తుగా నిలుస్తున్నాడు మాండ్యా నుండి బీజేపీ బరిలోకి దిగడం లేదు బీజేపీ మద్దత్తు కూడా ఇప్పుడు సుమలతకే ఉంది. ఇక పోతే కాంగ్రెస్ అభ్యర్థి నిఖిల్ గౌడ కి తన తండ్రి తన తాత మద్దత్తుగా ఉన్నారు పైగా మాండ్యా కాంగ్రెస్ కి కంచుకోట లాంటిది. ఇక ఇద్దరి నడుమ పోటీ చాలా రసవత్తరంగా మారింది. పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాండ్యాకి చేరానున్నారు. తనకి ఎంతో సన్నిహితుడైన దేవగౌడ మనవడు నిఖిల్ తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. ఒక ప్రత్యేక రోడ్ షో ని బాబు అక్కడ నిర్వహిస్తున్నారు. బాబు రోడ్ షో కి అక్కడ జనం బారులు తీసే అవకాశాలు ఉన్నాయట. నిఖిల్ కె వోటు వేయాలని అందుకుగాల కారణాలని బాబు ప్రజలకి వివరించనున్నారట.

మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం లో దేవగౌడ బాబు ప్రచారానికి హాజరయిన విషయం తెలిసిందే. ఇక బాబు కి దేవగౌడ కి మద్య మంచి సాన్నిహిత్యం కూడా ఉన్న విషయం మనకి తెలుసు. దేవగౌడ ఆంధ్రప్రదేశ్ కి ప్రచారానికి వచ్చినప్పుడు తన మనవడు నిఖిల్ తరఫున బాబు ప్రచారం చేయవలసిందిగా దేవగౌడ కోరారు. ఆయన కోరిక మేరకు చంద్రబాబు నేడు కర్నాటక లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరనున్న చంద్రబాబు, సాయంత్రం 4 గంటల సమయంలో మాండ్యా చేరుకుంటారు. ఆపై అక్కడ రోడ్ షో నిరాహిస్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: