చాక్లెట్ కోసం లోపలికి వెళ్లింది..! కామందుడికి బలైపోయింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలో కామందుల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోతుంది. వీళ్ళ కామానికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు కన్నెస్తున్నారు ఆపై కాటేస్తున్నారు. ఇలా రోజుకి వందల మంది మహిళలు చిన్నారులు బలైపోతున్నారు. మహిళలకి భద్రత లేని దేశంగా ప్రపంచ దేశాల్లో భారత్ గుర్తింపు తెచ్చుకుంటుంది. అయినా కూడా చట్టంలో ఎటువంటి మార్పు రావడం లేదు కామందులకి చెక్ పెట్టడం లేదు. రేప్ లేనిది రోజు లేదు అన్నంత అద్వానమైన పరిస్థితి నెలకొంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఓ 8 ఏళ్ల చిన్నారి కామానికి బలయ్యింది. అత్యాచారానికి గురయ్యింది.. ఈ విషయం వారి కుటుంబ సభ్యులని కలచి వేసింది.

వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లోని తారకరామ నగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక శుక్రవారం ఇంటి వద్దే ఆడుకుంటోంది. ఇక అటు పక్కనే ఉన్న చోడిపల్లి జగన్నాథం అనే కామాందుడు ఆమె పై కన్ను వేశాడు. చిన్నారి అని కూడా చూడకుండా ఆమెపై అత్యాచారం చేయాలని నిశ్చయించుకున్నాడు. చాక్లెట్ ఇస్తాను అని చెప్పి ఆ బలికాని లోపలికి పిలిచాడు. పాపం చాక్లెట్ ఇస్తాడేమో అని ఆ బాలిక లోపలికి వెళ్ళగానే దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

అప్పుడే ఆ బాలిక తల్లి అటువైపుగా వెలుతున్నప్పుడు బాలిక ఏడుపు శబ్ధం వినిపించింది. ఇక తల్లి లోపలికి వెళదామని తలుపు కొడితే తెరవడం లేదు. స్థానికుల సహాయం తో తలుపుని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసే లోపే పక్క తలుపు నుండి నిందితుడు పరారయ్యాడు. ఇక బాలికని ప్రశ్నించగా ఏడుస్తూ సమాధానం చెప్పింది. ఇక వెంటనే కుటుంబ సభ్యులు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వాళ్ళు సరైన రీతిలో స్పందించలేదు. పట్టనట్టుగా స్పందించడంతో.. డీఎస్పీ రవివర్మ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో కాకినాడ పోర్టు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: