ప్రపంచ కప్ సమరానికి భారత సైన్యం ఇదే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచకప్ ఆటలు దేగ్గరికొచ్చేశాయి. ఇంగ్లాండ్ వేధికగా మే 30 వ తరికు నుండి ప్రపంచ కప్ ఆటలు ప్రారంభం కానున్నాయి. ఈ సంధర్భంగా వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ జట్లని ప్రకటించేశాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే తమ జట్టుని ప్రకటించేసింది ఇక భారత్ కూడా తమ జట్టుని ఫైనల్ చేసి 15 మంది ఆటగాళ్ల జాబితాని విడుదల చేసింది.

నిజానికి ఐ‌సీసీ ఈ నెల 23వ తేదీ కి అన్నీ బొర్ద్లు తమతమ జట్లని విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కానీ భారత ఆస్ట్రేలియా జట్లు మాత్రం వారం రోజుల ముందే తమ జట్లని ప్రకటించేశాయి. అయితే ఈ 15 మండి జట్టుని ప్రకటించడానికి ముందు సామాజిక మాధ్యమాల్లో జట్టు ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని ఎన్నో ఊహాగానాలు వచ్చాయి కానీ అన్నిటికీ అనుగూనంగా చాలా సింపుల్ గా జట్టుని ప్రక్టించింది బి‌సీసీఐ.

చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం ముంబైలో సమావేశమైన సెలక్షన్ కమిటీ, టీమిండియా కోచ్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో సమావేశమై జట్టు ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల ప్రతిభ, ఫిట్‌నెస్‌తో పాటు పలు అంశాల ఆధారంగా సెలక్టర్లు సుధీర్ఘ కసరత్తు అనంతరం తుది జట్టును ప్రకటించారు. రిషబ్ పంత్, అంబటి రాయుడులకు జట్టులో చోటు దక్కుతుందని చాలా ఊహాగానాలు వినిపించాయి కానీ అనూహ్యంగా ఇద్దరికీ చోటు దక్కలేదు. దినేష్ కార్తిక్ ను రిజర్డ్వ్ వికెట్ కీపర్ గా తీసుకున్నారు. విజయ శంకర్ నాలుగో స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. కేదార్ జాదవ్ రవీంద్ర జడేజాలను తుది జట్టులో రొటేట్ చేసే అవకాశం ఉంది.

భారత జట్టిదే:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ.

Share.

Comments are closed.

%d bloggers like this: