నాని మాస్.. సుధీర్ బాబు క్లాస్..! విభిన్నమైన కథ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ నానితో మరోసారి జతకట్టబోతున్నాడు. నానితో ఇంద్రగంటి ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు ఇప్పుడు దీంతో కలిపి మూడవ సారి పూర్తవుతుంది. ఇకపోతే నానితో ఈసారి ఆయన మల్టీస్టారర్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా సుధీర్ బాబు కనిపించనున్నాడు. సుధీర్ బాబుతో కూడా గతంలో ఇంద్రగంటి ఇక సినిమా తీశాడు ఇప్పుడు ఇది రెండవది.

రెగ్యులర్ కథ కాకుండా విభిన్నమైన కన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని నెగిటివ్ గా కనిపితాడు. ఇక సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబందించి పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాని సరసన నాయికగా అదితీ రావ్ హైదరీని.. సుధీర్ బాబు జోడీగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జూలై 2వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇంకా టైటిల్ పై క్లారిటీ రాలేదు త్వరలో మరిన్ని అప్డేట్స్ తో చిత్రా ఉయింట్ మన ముందుకు రానుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: