నాగబాబు వచ్చేస్తున్నాడు..! జబర్దస్త్ కి మరింత జోష్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగురాష్ట్రాల్లో ఎన్నికలు గందరగోళాలు వర్గ దాడులు ట్యాంపరింగ్ ల మధ్య హోరాహోరీగా సాగాయి.. ఎవరికివారు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరూ చూసినా 130 పక్కా అంటున్నారు. అయితే పవన్ మాత్రం ఎన్నికలు ముగిశాకా నోరు మెదపడం లేదు. కానీ మెగా బ్రదర్ నాగ బాబు మాత్రం కాస్త యాక్టివ్ గా కనిపిస్తున్నారు. నేడే ఆయన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లు మొదలు పెట్టారు ఇక తాజాగా ఫేస్ బుక్ లో ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆయనని అడిగిన పలు ప్రశ్నలకి ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

జబర్దస్త్ గురించి ఆయనని అడగగా.. జబర్దస్త్ ఒక ఉత్తమమైన ప్రోగ్రాం అని ఆయన బదులిచ్చారు. జబర్దస్త్ వల్లే తనకి ఇంత పాపులారిటీ వచ్చిందని తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా జబర్దస్త్ ని మాత్రం విడిచేది లేదని జబర్దస్త్ లో జడ్జిగా ఉండటమే తనకు ముఖ్యం అని ఆయన చెప్పుకొచ్చారు. జబర్థస్త్ ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరించడం అంటే సమాజ సేవ లాంటిదే అని వ్యాఖ్యానించారు. నెలలో ఐదు రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదన్నారు. అదే సమయంలో సినిమాలు మాత్రం చేయనని తన మనసులో మాట బయట పెట్టారు.

ఇక జబర్దస్త్ లో మరో జడ్జీగా ఇన్నేళ్లు వైసీపీ నగిరి ఎమ్మెల్యే గా ఉన్న రోజా నిర్వహించారు. ఆమెకి కూడా జబర్దస్త్ అంటే చాలా గౌరవం.. ఇన్నేళ్లు అందరినీ నాగబాబు రోజాలు కలిసి ఎంతగానో అలరించారు అంటే కాకుండా జడ్జిగా వాళ్ళు పూర్తి మార్కులు కొట్టారు. అయితే నాగబాబు సమాధానాలు చూస్తే మళ్ళీ త్వరలో ఆయన జడిజీగా రావడం కాయం అని అర్ధం అవుతుంది కానీ రోజా పైనే క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ వైసీపీ ప్రభుత్వానికి వస్తే రోజాకి జగన్ కేబినెట్ లో తప్పనిసరిగా పదవి ఇస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే ఆమె జబర్దస్త్ కి దూరమయ్యే చాన్సెస్ ఎక్కుబగా ఉన్నాయి. ప్రస్తుతం రోజా నాగబాబు స్థానాల్లో శేఖర్ మాస్టర్ మీనా ఉన్నారు. ఇక త్వరలో మళ్ళీ పాత జద్జెస్ వచ్చే సూచనలు కనిపితున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: