ప్రభాస్‌ను ఖాళీ చేయించడం కుదరదు: హైకోర్టు

Google+ Pinterest LinkedIn Tumblr +

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని తన భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం కోర్టు కీలక తీర్పు చెప్పింది. ఆ భూముల నుంచి ప్రభాస్‌ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమన్న కోర్టు, ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం దరఖాస్తును తిరస్కరిస్తే, ప్రభాస్ మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

ప్రభాస్‌ దరఖాస్తును పరిశీలించాక జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా వందల ఎకరాల్లో యాజమాన్య హక్కుల వివాదం ఎదుర్కొంటున్న వారు కూడా ప్రభాస్‌లాగే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది. భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్డ్‌ విక్రయ దరఖాస్తుల ద్వారా దక్కిన హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా క్రమబద్ధీకరణ దరఖాస్తు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందని, అదే సమయంలో హక్కుల సమస్య తీరుతుందని తెలిపింది.

Share.

Comments are closed.

%d bloggers like this: