రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కి ఆ హీరోయిన్ ను తీసుకు: సల్మాన్

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ కి గాయం అవ్వడంతో షూట్ కు కాస్త గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్ గా జూనియర్ కి కూడా చేతికి చిన్న గాయం అవడం వల్ల తను కూడా రెస్ట్ లో ఉన్నాడు. ఇక్కడికే రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా..తారక్ కు మాత్రం ఇంకా ఎవరినీ సెట్ చేయలేదు.
దీంతో రాజమౌళికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక సలహా ఇచ్చాడట. బాలీవుడ్‌ నటి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ను ఎంపికచేసుకోవాలని రాజమౌళికి సలహా ఇచ్చారట. శ్రీలంకకు చెందిన జాక్వెలీన్‌లో కాస్త బ్రిటిష్‌ పోలికలు కూడా ఉన్నాయని, తారక్‌కు జోడీగా జాక్వెలీన్‌ సరిపోతారని సల్మాన్ చెప్పినట్టు తెలిసింది. తారక్‌కు జోడీగా బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో మరో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్‌, పరిణీతి చోప్రా, నిత్యా మేనన్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరికైన రాజమౌళి ఓకే చెప్తాడా..లేక సల్మాన్ చెప్పిన సలహా పాటిసాడో తెలియాల్సి ఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: