ఈ విజయం ఆ కుర్రాళ్ళదే: స్మిత్

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజస్థాన్‌ మరో విజయం సాధించింది. జట్టు తిరిగి పుంజుకోవడంపై ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ స్పందించాడు. ‘వెంటవెంటనే వికెట్లు కోల్పోయి మాకు మేమే విజయావకాశాలను క్లిష్టతరం చేసుకున్నాం. అయితే రియాన్‌ పరాగ్‌, గోపాల్‌, ఆర్చర్‌, వరుణ్‌ బాగా ఆడారు. విజయంలో కీలక పాత్ర వాళ్లదే. పరాగ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. గోపాల్‌, ఆర్చర్‌ భాగస్వామ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ వాళ్లిద్దరు జట్టును ఆదుకున్నారు. తొలి మ్యాచ్ ఆడిన థామస్‌ అంచనాలు అందుకున్నాడు. బౌలింగ్‌లో అందరికంటే ముఖ్యంగా వరున్‌ ఆరోణ్‌ గురించి చెప్పాలి. కొత్త బంతిని సైతం బాగా స్వింగ్‌ చేశాడు. కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. మా బౌలర్లు మొదటి 8 ఓవర్లు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ను బాగా కట్టడి చేశారు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో దినేశ్‌ కార్తీక్‌ బ్యాటింగ్‌తో ఒంటరి పోరాటం చేశాడు. జొఫ్రా ఆర్చర్‌తో పాటు బెన్‌ స్టోక్స్‌ ఇకనుంచి జట్టుకు అందుబాటులో ఉండరు.
వాళ్లిద్దరూ ఇప్పటికే స్వదేశానికి వెళ్లనున్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ తర్వాత నేను కూడా జట్టుకు దూరం కావాల్సి వస్తుంది. అప్పటిలోపు ఉన్న మ్యాచులన్నింటిలోనూ విజయాలు సాధించేందుకు నావంతు కృషి చేస్తాను’ అని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 11 మ్యాచులాడిన రాజస్థాన్‌ 4 విజయాలు సాధించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: