‘ఆర్ఆర్ఆర్’లో నిత్యా మీనన్ పాత్ర ఇదే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ పాత్ర కోసం నటిని ఎంపిక చేసేందుకు ఆడిషన్స్ కూడా జరిగాయని ప్రచారం జరిగింది. తాజాగా ఆ పాత్రకు గాను నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. గిరిజన యువతి పాత్రలో నిత్యామీనన్ కనిపించబోతున్నట్లుగా సమాచారం. రాజమౌళి కొన్ని రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చెప్పిన దాని ప్రకారం కొమురం భీంకు ముగ్గురు భార్యలు ఉండేవారు. అందుకే ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఒక విదేశీ నటితో పాటు నిత్యామీనన్ ను కూడా తీసుకున్నట్టు తెలిసింది.
రాజమౌళి సినిమాలో నటించేందుకు హీరోయిన్స్ క్యూ కడతారు.
అలాంటిది నిత్యామీనన్ కు ఆ ఛాన్స్ దక్కడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. సినిమాలో కొన్ని సీన్స్ లో మాత్రమే నిత్యామీనన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కు భార్యగా కనిపించనుందా లేదంటే ప్రేయసిగా కనిపించబోతుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: