పెళ్లి కాకుండానే తల్లైన రోబో బ్యూటీ!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం స్టార్ భామలు బేబీ బంప్ తో మీడియాకు ఫోజులివ్వడం కామన్ అయిపోయింది.
కొందరు అందాల నాయికలు ఏకంగా బేబి బంప్ తో ర్యాంప్ వాక్ లే చేశారు. పలు ఫ్యాషన్ ఈవెంట్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లారా దత్తా.. నేహా ధూపియా ఇదివరకూ ఈ తరహా ఫీట్స్ వేసి ఆశ్చర్యపరిచారు. ఇక అదే బాటలో లేడీ రోబోట్ ఎమీజాక్సన్ సైతం తన బేబి బంప్ తో ప్రో నోవియాస్ ఫ్యాషన్ షోలో తళుక్కుమంది.
ఎమీ పూర్తిగా రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఇక ఈ బేబి బంప్ ఫోటోకి అభిమానుల నుంచి స్పందన వచ్చింది. కొందరైతే ఎమీ ఏకంగా కవలల్ని కనాలని ఆశీర్వదించారు. అసలు పెళ్లెప్పుడు చేసుకున్నావ్? నాకు ఇన్విటేషన్ అయినా ఇవ్వలేదని ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఎమీజాక్సన్ బేబి బంప్ ప్రదర్శన తాజా లైవ్ షోలో హైలైట్ అయ్యింది. ఇక తన బ్రిటీష్ బోయ్ ఫ్రెండ్ జార్జి పనాయటౌ ని పెళ్లాడేందుకు ఎమీ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెళ్లి చేసుకునే వీలుందని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అర్థమైందా..ఎమీకి జస్ట్ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఇంకా పెళ్లి కాలేదు.

Share.

Comments are closed.

%d bloggers like this: