ఏపీలో అయిదు కేంద్రాల్లో రీ పోలింగ్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్‌లోని అయిదు కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు రీ పోలింగ్‌ ప్రారంభమైంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఈ పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం 5,064 మంది ఓటర్లు ఉన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్‌సభ స్థానాలు రెండింటికీ, నెల్లూరు జిల్లా పరిధిలోని రెండు కేంద్రాల్లో కేవలం లోక్‌సభ స్థానానికి మళ్లీ పోలింగ్‌ నిర్వహిస్తారు.
+ నెల్లూరు జిల్లా సూళ్లురుపేట నియోజకవర్గం పరిధిలో అటకానితిప్పలోని 197వ పోలింగ్‌ కేంద్రం (ఓటర్లు 578 మంది)
+ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో కలనూతలలోని 247వ పోలింగ్‌ కేంద్రం (ఓటర్లు 1070 మంది)
+ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువులోని 244వ పోలింగ్‌ కేంద్రం (ఓటర్లు 1376 మంది)
+ గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో కేశనుపల్లిలోని 94వ పోలింగ్‌ కేంద్రం (ఓటర్లు 956 మంది)
+ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువులోని 244వ పోలింగ్‌ కేంద్రం (ఓటర్లు 1376 మంది)

Share.

Comments are closed.

%d bloggers like this: