నయన్ పెళ్లి ఫిక్స్..ఎప్పుడో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

లేడీ సూపర్ స్టార్ గా పిలిపించుకుంటున్న నయన తార ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉంది. కాగా ఈ అమ్మడు కాళీ దొరికినప్పుడల్లా ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలసి షికార్లు కూడా చేస్తుంటుంది. దీంతో ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మరో వైపు తమిళ మీడియా మాత్రం వాళ్లకి నిచ్చితార్ధం కూడా జరిగిపోయిందని వార్తలు ప్రసారం చేసింది. ఆ వార్తలను పట్టించుకోకుండా.. ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకోవాలని నయన్‌, విఘ్నేశ్‌ నిర్ణయించుకున్నారట. అందరి సమక్షంలో ఓ నిశ్చితార్థ వేడుక నిర్వహించాలని ఇరు వైపు కుటుంబాలు ఆలోచిస్తున్నాయట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో నయన్, విఘ్నేశ్‌ ఓ ఇంటివారు అవుతారు. 2015లో ‘నానుమ్‌ రౌడీదాన్’ అనే చిత్రం ద్వారా నయన్‌, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు విఘ్నేశ్‌ దర్శకత్వం వహించగా.. నయన్‌ హీరోయిన్ గా నటించారు. ఆ పరిచయం కాస్తా స్నేహానికి దారి తీసి ప్రేమగా మారింది. అప్పటినుంచి నయన్‌, విఘ్నేశ్‌ ఒకరిని విడిచి మరొకరు అసలు ఉండరు.

Share.

Comments are closed.

%d bloggers like this: