టీడీపీ స్టేట్ ఆఫీస్ ని కూల్చివేయాలని ఫిర్యాదు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర కార్యాలయం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.

నూతనంగా కొత్త కార్యాలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయాన్నే రాష్ట్ర కార్యాలయంగా మార్చుకుంది టీడీపీ.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలన్నింటిని గుంటూరు పార్టీ కార్యాలయం వేదికగా నిర్వహిస్తోంది.

అయితే ఆ రాష్ట్ర కార్యాలయం అక్రమ కట్టడమంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ రాష్ట్ర కార్యాలయం కార్పొరేషన్ సంస్థలో నిర్మించారని అది అక్రమ కట్టడమంటూ ఆరోపించారు.

దాన్ని కూల్చివేయాలని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరు నగర పాలక సంస్థ అధికారులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన సమయంలో టీడీపీ కార్యాలయంలో టీడీఎల్పీ సమావేశం జరుగుతుండటం గమనార్హం.

Share.

Comments are closed.

%d bloggers like this: