‘బిగ్ బాస్ 3’ కేసులో స్టార్ మాకి నోటీసులు!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘బిగ్ బాస్ 3’ షో ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. పదిహేను మంది కంటెస్టంట్ లతో షోని మొదలుపెట్టారు. అయితే ఈ షోలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కొద్దిరోజుల క్రితం జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ షోపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు స్టార్ మా ఛానెల్ సంస్థ అడ్మిన్ హెడ్ శ్రీధర్ కి మంగళవారం నాడు నోటీసులిచ్చారు. ‘బిగ్ బాస్ 3’ షో పేరుతో లైంగిక వేధిస్తున్నారని యాంకర్ శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో పోలీసులు స్టార్ మా ఛానెల్ కి వెళ్లి నోటీసులు అందజేశారు. అగ్రిమెంట్ వ్యవహారం, ఎంపిక విధానం, నిబంధనలు అలానే బిగ్ బాస్ షో నిర్వాహకులు శ్యాం, మిగిలిన ముగ్గురి పాత్రకు సంబంధించి పోలీసులు ఆరు ప్రశ్నలు వేశారు. దీనిపై యాజమాన్యంతో మాట్లాడి రెండు రోజుల్లో సమాధానమిస్తామని శ్రీధర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: