‘సరిలేరు నీకెవ్వరూ’..దూకేవాడే సైనికుడు !

Google+ Pinterest LinkedIn Tumblr +

73వ స్వాతంత్య్ర దినోత్స‌వ కానుకగా అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం నుండి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను సైనికులకు డెడికేట్ చేస్తూ సైనికుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. దేవి శ్రీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్ రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తుంది. దేశ సరిహద్దుల్లో సైనికులు దేశం కోసం ఎలా పోరాడుతున్నారో విజువల్‌గా చూపించారు. ‘భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు’ అంటూ సాగిన ఈ పాటల ఇండో పాక్ వార్ 1971, కార్గిల్ వార్ నాటి పరిస్థితుల్ని గుర్తు చేశారు. సైనికుడి గొప్పతనం, అలానే దేశానికి అతడు అందించే సేవల గురించి తెలిపే ఈ అద్భుతమైన వీడియో టీజర్, ఇప్పటికే యూట్యూబ్ లో అదరగొట్టే వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. ఇకపోతే టీజర్ చివర్లో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గెటప్ లో గన్స్ పట్టుకుని ఉన్న సీన్స్ కు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతూ, టీజర్ పై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి వరుస బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్నారు. ఈ చిత్రం ‘F2’ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా సంక్రాంతి కానుకగా చిత్రం విడుద‌ల కానుంది. ఇందులో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇటీవ‌ల మహేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఇంట్రో వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్. దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. చిత్రంలో బండ్ల గ‌ణేష్‌, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు సినీ న‌టులు న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: