సుభాష్ చంద్రబోస్ గా ఎన్టీయార్ కొడుకు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశవ్యాప్తంగా అటు సామాన్యుల నుంచి ఇటు సినీ ప్రముఖుల వరకు అందరూ 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయార్ తన తనయుడు అభయ్ రామ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆ ఫొటోలో ఖాకీ దుస్తులు వేసుకుని సెల్యూట్ చేస్తూ అచ్చం స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ లా ఉన్నాడు అభయ్ రామ్. అభ‌య్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఎన్టీఆర్ పెద్ద‌ కొడుకు అభయ్ రామ్ 2014 జులై 22 లో జన్మించిన విష‌యం తెలిసిందే. కాగా, ఎన్టీయార్ ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్`లో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీయార్ కొమరమ్ భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: