బాత్రూంలో సెక్స్ కావాలన్నాడు..చితకబాదాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాత్రూం లో శృంగారంలో పాల్గొనాలని ఓ నవ వధువు భర్త పట్టుబట్టాడు ! అయితే ఆ నవ వధువు మాత్రం అందుకు నిరాకరించడంతో భార్యని బాగా కొట్టాడు ! అంతేకాదు బాత్రూం లోనే బలవంతంగా అత్యాచారం చేసాడు ! దాంతో అహం దెబ్బతిన్న ఆ నవ వధువు పోలీసులను ఆశ్రయించింది . ఈ సంచలన సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే…భావనగర్‌కు చెందిన 19 ఏళ్ల యువతికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. కొన్ని రోజుల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. ఐతే కామవాంఛలు ఎక్కువగా ఉన్న భర్త ప్రవర్తన వీరి కాపురంలో చిచ్చుపెట్టింది. సెక్స్ విషయంలో భర్త బలవంత పెట్టడంతో భార్య తిరస్కరించేంది. ఆ కోపంతో ఆమెను అతడు ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. ఐనా ఆమె ఓపికతో భరిస్తూ వచ్చింది. ఇటీవల బాత్రూమ్ సెక్స్ కోసం బలవంతం చేయడంతో.. వద్దని భార్య గొడవ పెట్టుకుంది. తన కోరికను కాదన్నదనే కోపంతో భార్యను అతడు చితకబాదాడు. ఇక భరించడం తన వల్ల కాదని భావించిన ఆమె..నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అంతేకాదు తాజాగా తాను రాత్రి సమయంలో నిద్రపోతుండగా అత్తమామలు నిద్రలేపి పుట్టింటికి వెళ్లి అదనపు కట్నం తీసుకురావాలంటూ ఇంటి నుంచి గెంటేశారని పోలీసులకు తెలిపింది. అలాగే లైంగిక కోరికలు తీర్చాలంటూ భర్త అన్నతనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఐపీసీ 498-ఎ, 354, 323, 294-బి, 114 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: