రేవంతాగ్రహం..గునపం దింపుతా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వచ్చేవారి గుండెల్లో గునపం దింపుతామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… యురేనియం తవ్వకాల కారణంగా ఈ ప్రాంతమంతా కలుషితమైపోతుందని..అదే జరిగితే ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను కూడా నల్లమల్ల బిడ్డనే అని, ఒకవేళ నల్లమలలో ఎవరైనా యురేనియం తవ్వడానికి వస్తే వారి గుండెల్లో గునపం దింపుతానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు… యురేనియం తవ్వకాలను అడ్డుకోలేకపోయారంటూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై విరుచుకుపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. యురేనియం తవ్వకాలకు సహకరిస్తున్న.. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను నల్లమలలో సామాజిక బహిష్కరణ చేయాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కేసీఆర్‌ హామీ ఇచ్చేవరకు పోరాడాలని ఆయన ప్రజలకు చెప్పారు. నల్లమల బిడ్డలకు అండగా తాను ఉంటానన్నారు. కవులు, కళాకారులు, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: