ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం…జైట్లీ పరిస్థితి విషమం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది 34 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డు భవనంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఒకటో అంతస్థు నుంచి రెండో అంతస్థుకు మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలను, రోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడినట్టు సమాచారం. అయితే ఇదే ఆసుపత్రిలో మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌లోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఆయన గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఎయిమ్స్‌లోని వేరే భవనంలో అరుణ్ జైట్లీకి చికిత్స కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం జైట్లీకి కార్డియాక్ న్యూరో సెంటర్‌లో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు, జైట్లీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎయిమ్స్‌కు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: