“వెంకీ మామ” కు గాయం..ఆగిన షూటింగ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..అయితే ఈ చిత్రం కోసం ఓ పాటను చిత్రీకరిస్తుండగా వెంకటేష్‌ గాయపడ్డారని సమాచారం. ఓ పాటకు డ్యాన్స్‌ చేస్తుండగా వెంకటేష్ కాలు బెణికింది..లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్న వెంకటేశ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, కాలును చూపి పరిశీలించిన వైద్యులు పూర్తిగా 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారట. ‘వెంకీ మామ’లో వెంకటేష్, నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4 న విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ ఒకవైపు వెంకటేష్ కాలి గాయం , మరోవైపు సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2 న విడుదల అవుతోంది కాబట్టి వెంకీ మామ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా నాగచైతన్య కు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: