గాంధీభవన్ వేదికగా నాపై కుట్ర..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లపై తెలంగాణ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, ప్రముఖ సినీ నటి విజయశాంతి స్పష్టత ఇచ్చారు. ఈ ప్రచారం గాంధీభవన్ నుంచే ప్రారంభమైందని, గాంధీభవన్ లో తనపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. తనపై వస్తున్న ప్రచారంపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు కూడా ఆమె తెలిపారు. తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని విజయశాంతి స్పష్టం చేశారు. రాజకీయాల్లో హడావుడి నిర్ణయాలు తీసుకోననని.. పార్టీ మారాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానని చెప్పారు విజయశాంతి. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపట్ల విజయశాంతి అసహనంగా ఉన్నారని అందుకే ఆమె పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతూ ఉంది.ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. ఇకపోతే విజయశాంతి ప్రస్తుతం వెండితెరపై బిజీబిజీగా గడుపుతున్నారు. దాదాపు 14ఏళ్లు విరామం అనంతరం ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనబడనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈ లేడీ సూపర్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: