చంద్రబాబు హత్యకు కుట్ర..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చంద్రబాబును‌ హతమార్చేందుకు ఏపీలో కుట్ర జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వ్యాఖ్యానించారు. అవసరమైతే చంద్రబాబును‌ రక్షించుకోవడం కోసం జగన్ ఇంటి ముందు ఆత్మహత్య ‌చేసుకుంటానని.. ప్రభుత్వం చేసే కుట్రను భగ్నం ‌చేయడానికి తాను పోవడానికైనా సిద్ధమని బుద్దా చెప్పుకొచ్చారు.” వైఎస్ జగన్ అధికారంలోకి‌ వచ్చాక చంద్రబాబుకు భద్రత తగ్గించారు. హైకోర్ట్ చంద్రబాబుకు‌ భద్రత పెంచండని‌ చెబితే‌ అది‌ కూడా పక్కన పెట్టారు. కావాలనే చంద్రబాబు ఉంటున్న ఇళ్లును‌ డ్రోన్‌తో అడుగడుగు విజువల్స్ తీసారు. చంద్రబాబును‌ హతమార్చే కుట్రలో భాగమే ఆయన ఇంటిని‌ అణువణువు డ్రోన్‌తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులే రెక్కి నిర్వహిస్తున్నారని‌ మాకు అనుమానం ఉంది. ప్రాణహాని ఉన్న వ్యక్తి ఇంటిని డ్రోన్ కెమెరాతో విజువల్స్ తీసేముందు అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి గత 15 రోజులుగా మాట్లాడుతున్న మాటలతో మాకు అనుమానం కలుగుతోంది. చంద్రబాబును చంపాలనే కుట్ర గురించి మొత్తం భారతదేశ ప్రజలకు తెలియాలి” అని బుద్దా చెప్పుకొచ్చారు. “వరద వస్తే సరదగా మంత్రులు బ్యారేజ్ ఎక్కి‌ చూస్తున్నారు. లంక గ్రామాల‌ ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేసారు. ఏపీలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏపీ సీఎం జగన్ అమెరికాలో ‌విలాశవంతమైన జీవితం గడుపున్నారు.. అదే చంద్రబాబు అయితే ఎక్కడ ఉన్నా వెంటనే రాష్ట్రానికి వచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేవారు. జగన్ 70 రోజుల పాలనను గాలికి వదిలేసారు” అని బుద్దా విమర్శలు గుప్పించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: