మామా అల్లుళ్ళ కలయిక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన చంద్రబాబు ఇన్నాళ్ల తర్వాత జూ.ఎన్టీఆర్ ను కలవడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరి కలయిక రాజకీయపరమైనది కాదు..కుటుంబపరమైనది..ఎన్టీఆర్ కుమారుడు, మాజీ మంత్రి దివంగత నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించారు. తిథి ప్రకారం ఆదివారం హరికృష్ణ వర్థంతిని నిర్వహించాలని కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. హరికృష్ణ నివాసంలో ఆయనకు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సాదరంగా స్వాగతం పలికారు. హరికృష్ణ తనయులతో ఆత్మీయంగా మసలుకున్న చంద్రబాబు వారితో కుటుంబపరమైన విషయాలు చర్చించినట్టు తెలిసింది. అంతకుముందు హరికృష్ణ చిత్రపటం వద్ద ఆయన నివాళులు అర్పించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: