తెగిపోయిన బంధం..రాహుల్ VS పునర్నవి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ సీజన్ 3 ప్రస్తుతం 4 వారలు పూర్తి చేసుకొని..5వ వారంలోకి అడుగుపెట్టింది. కాగా, నాల్గవ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఆదివారం నాడు రోహిణి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకివెళ్ళింది. ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా సోమవారం నాడు నామినేషన్స్ జరగనున్నాయి..అయితే ఇటీవల ముగిసిన వీకెండ్ లో నాగార్జున ఇంటి సభ్యులంతా మాస్క్ లు తీసేసి హౌస్ లో మెలగాలని హెచ్చరించారు. కంటెస్టెంట్స్ కూడా ఓకే అంటూ సమాధానం ఇచ్చారు. కాబట్టి ఇకపై నామినేషన్ ప్రక్రియ కఠినంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం నాటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నామినేషన్ ప్రక్రియలో జరుగుతున్న విధానాన్ని చూపించారు. పునర్నవి రాహుల్ ని నామినేట్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు.ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాహుల్ పునర్వవి అలా చేయడంతో అతని మొహం వాడిపోయింది. మరి దీని వెనక అసలు కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్నారు. అయితే గేమ్ ని గేమ్ లా ఆడతానని ఆమె ఇంతకు ముందు చెప్పిన విషయం తెలిసిందే. అదీగాక రాహుల్ వల్ల ఆమె గేమ్ పాడవుతుందని భావిస్తున్నట్టు కనబడింది. వీరిద్దరి స్నేహం బయటకి వేరేలా ప్రొజెక్ట్ అవుతుందన్న భయం ఎక్కువై దాన్ని ఇక్కడితో కట్ చేద్దామనే ఆలోచనతో ఆమె రాహుల్ ని నామినేట్ చేసి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: