“సైరా”..చరిత్ర మనతోనే మొదలవ్వాలి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అటు మెగా అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సైరా’ టీజర్ వచ్చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌న్ స్వ‌యంగా త‌న సొంత బ్యాన‌ర్ అయిన కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీపై దాదాపు రూ.200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఒక టీజర్‌తో పాటు, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే మ‌రో టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం ముంబైలో రిలీజ్ చేశారు. 1.47 నిమిషాల పాటు ఉన్న టీజ‌ర్ దుమ్ము రేపుతోంది.

‘‘చరిత్ర స్మరించుకుంటుంది.. ఝాన్సీ లక్ష్మీభాయి, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలను. కానీ, ఆ చరిత్రపుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు.. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు..’’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ టీజర్ కి ఎంతో బలాన్ని ఇచ్చింది. ‘హు ఈజ్ దిస్ నరసింహారెడ్డి?’ అంటూ బ్రిటిష్ అధికారి అన్నప్పుడు ఉదయించే సూర్యుడిలా చీల్చికుంటూ గుర్రంపై ఆ వీరుడు వస్తోన్న దృశ్యం టీజర్‌కే హైలైట్. ఇక మెగాస్టార్ సైరా పాత్రలో చెప్పిన డైలాగ్ కూడా హైలైట్. రేనాటి వీరుల్లారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర మనోతోనే మొదలవ్వాలి అని చెప్పిన మాటలు గుండెను తాకుతున్నాయి. ఇక చివరగా ఒక్కసారిగా సైరా వీరత్వాన్ని తెలిపేలా పవర్ స్టార్ సైరా నరసింహా రెడ్డి అని చెప్పిన డైలాగ్ , యాక్షన్ సీన్స్ అలాగే పాత్రలో ప్రతి లుక్ ఆడియెన్స్ లో ఉన్న అంచనాల డోస్ ని తారా స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈరోజు టీజర్‌ను కూడా ఐదు భాషల్లో విడుదల చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: