తుదిశ్వాస వరకు టీడీపీలోనే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొన్నిరోజులుగా పార్టీ మారుతున్నట్టు తనపై వస్తున్న వార్తలపై తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి స్పందించారు. తాను బీజేపీ లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు…ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకూ తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని చెప్పుకొచ్చారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని దివ్యవాణి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు దివ్యవాణి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి. తన పదునైన మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ అనతికాలంలోనే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దివ్యవాణి. గత కొన్ని రోజులుగా యామిని సాధినేని, దివ్యవాణి బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో దివ్యవాణి దీనిపై వివరణ ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: