పవన్ బర్త్ డే.. రూ.2వేల కోట్ల బ్లాక్ మనీని వైట్‌గా మార్చే ప్లాన్?

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ సోషల్ మీడియా.. ఫేస్‌బుక్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది…పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు దాదాపు రూ. 2000 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలనే ప్లాన్‌లో అమెరికాలోని తానా వర్గం ఉందని సమాచారం ఉన్నట్టు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం సంచలన ఆరోపణలు చేసింది. పవన్ అభిమానుల ముసుగులో విరాళాలు వసూలు చేసి.. వాటికి చంద్రబాబు ఇచ్చిన బ్లాక్ మనీని కలిపి దాన్ని వైట్ మనీగా మార్చడానికి పక్కా పథకాన్ని ప్లాన్ చేశారు. ఇప్పటికే దీన్ని గుర్తించిన కొంతమంది పవన్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారంటూ వైఎస్ఆర్సీపీ ఫేస్‌బుక్ పేజీలో ఆరోపించారు.

ఈ ఆరోపణల పట్ల జనసేన కూడా ఘాటుగానే స్పందించింది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగమైన జనసేన శతఘ్ని వైఎస్ఆర్సీపీ ఆరోపణల పట్ల స్పందిస్తూ.. మీ ఆరోపణ నిజమైతే అధికారంలో ఉన్నారు కదా.. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు జగన్ గారూ అని సీఎంను ట్యాగ్ చేసి ప్రశ్నించింది. జనసేనను ఎదగనీకుండా ఎన్నాళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ వైఎస్ఆర్సీపీని నిలదీసింది. జనసేన అంటే ఎందుకంత భయమని ప్రశ్నించింది. జనసేనాని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఎంత వరకు నిజమో తెలీదు. కానీ జనసేన, టీడీపీ ఒకటేనని ప్రచారం చేయడం, పవన్‌పై బురద జల్లి ఆయన్ను పొలిటికల్ స్క్రీన్ మీది నుంచి మెల్లగా తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిమానులు అనుమానిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: