కోడెల వల్ల టీడీపీ పరువు పోయింది : వర్ల రామయ్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్ ను తన సొంత అవసరాల కోసం వినియోగించుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కోడెల శివప్రసాద్ చర్యల కారణంగా పార్టీ ప్రతిష్ట మసకబారిందని ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య తెలిపారు. కోడెల అలా చేయకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లలేదని, అందుకే తాను వాటిని ఇంట్లోనే ఉంచుకున్నానని అనడం కూడా సరి కాదని చెప్పారు వర్ల రామయ్య. అసలు ఆయన ఫర్నిచర్ ను తీసుకెళ్లడమే తప్పని అన్నారు. ఆ ఫర్నిచర్ ను తీసుకెళ్లమని అసెంబ్లీ కార్యదర్శి ఏమైనా అధికారికంగా చెప్పారా? అని ప్రశ్నించారు.

కోడెల ఇంట్లో ఉన్న అసెంబ్లీకి చెందిన ప్రతి సామాగ్రిని సిబ్బంది వెనక్కి తీసుకెళ్తారని, ఏవైనా రికవరీ కాకపోతే.. దాని విలువను ఆయన చెల్లించాల్సి ఉంటుందని వర్ల రామయ్య అన్నారు. కోడెల చర్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ ఒకింత దెబ్బ తిన్నదని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదనే విషయాన్ని తాను కూడా చెప్పకపోతే.. పార్టీలో ఇంకెవరూ మాట్లాడరని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీని అమరావతికి తరలించారు. అయితే ఆ సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌లో కొంతమేర కోడెల శివప్రసాదరావు తన సొంత నివాసాలకు తరలించుకున్నారు. అప్పటి అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివ ప్రసాద్ కొన్నింటిని సత్తెనపల్లి, నర్సరావుపేటకు తరలించుకున్నారు. అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Share.

Comments are closed.

%d bloggers like this: