ప్రభాస్ సలహా..అనుష్క పెళ్లి చేసుకో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీ లో హీరో, హీరోయిన్ పై వచ్చే రూమర్స్ కు హద్దు, అదుపు ఉండదు. ఎవరైనా కొంచం సన్నిహితంగా ఉంటే చాలు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఏదో జరుగుతుందని పుకార్లు పుట్టుకొస్తాయి. ప్రభాస్, అనుష్క కూడా ఇదే జాబితాలోకి వస్తారు…కొన్ని సంవత్సరాల నుంచి ఈ జంట మధ్య ఏదో సంబంధం ఉందని, త్వరలోనే ఈ జంట ఒకటి కాబోతుందని అనే వార్తలు వచ్చాయి..వీటిపై ఎన్నో సార్లు ఈ జంట వివరణ ఇచ్చింది. అయినప్పటికి పుకార్లు మాత్రం ఆగలేదు. అయితే తాజాగా ప్రభాస్ మరోసారి ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. ‘సాహో’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్ దీని గురించి మాట్లాడుతూ, తామిద్దరం రిలేషన్ లో ఉంటే ఆ విషయం దాచాల్సిన అవసరం లేదని, ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో తనకి తెలియడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పేది నమ్మకపోతే ఇంకేం చేయలేనని అన్నారు. ఈ ప్రచారం ఇంతటితో ఆగిపోవాలంటే అనుష్క అయినా పెళ్లి చేసుకోవాలి, లేదా తానైనా ఓ ఇంటివాడ్ని కావాలని ప్రభాస్ అభిప్రాయపడ్డారు. ఎవరో ఒకర్ని చూసుకుని త్వరగా పెళ్లి చేసుకో అంటూ అనుష్కకు సలహా ఇస్తానని చెప్పారు.

Share.

Comments are closed.

%d bloggers like this: