కొత్త ట్విస్ట్…హీరో రాజ్ తరుణ్ అరెస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సోమవారం రాత్రి అలకాపురిలో సినీ నటుడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి రాజ్ తరుణ్ క్షేమంగా బయటపడ్డాడు. కానీ, ఆ రోజు నుంచి ఈ కేసు విషయంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. కారు ప్రమాదం జరిగిన సమయంలో అప్పటి దృశ్యాలను అక్కడి స్థానికుడు, సినిమా ఇండస్ట్రీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ కార్తీక్‌ తన సెల్‌ ఫోన్‌ లో వీడియో తీశాడు. ఆ వీడియోలలో తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరినట్టు ఉంది. అయితే ఆ వీడియోలు ఇవ్వమని కార్తీక్‌ కు బెదిరింపులు ఎదురవుతున్నాయని, రాజ్‌ తరుణ్‌ మేనేజర్‌ నటుడు రాజా రవీంద్ర తనను ఫోన్‌ లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్ మీడియా మందుకు వచ్చారు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు తెలిపాడు. అయితే కార్తీక్ చెప్పేదంతా అబద్దమని వీడియో అడ్డంపెట్టుకుని తమని రూ.5లక్షలు డిమాండ్ చేశాడని మీడియా ముందుకు వచ్చారు రాజా రవీంద్ర. రాజ్ తరుణ్ వీడియోలతో కార్తీక్ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తాను ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే తాగాజా ఈ కేసులో విషయంలో రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ ప్రమాదంపై పోలీసులు రాజ్ తరుణ్ ను విచారించారు. అలాగే అతని పై 279, 336 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా డీసీపీ ప్రకటించారు. ఈ ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ స్టేట్ మెంట్ ను కూడ రికార్డ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై రాజ్ తరుణ్ విడుదలయ్యాడు. అలాగే కార్తీక్ ను కూడా అదుపులోకి తీసుకుని స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: