కౌంటర్ కి రీ-కౌంటర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ట్విట్టర్ వేదికగా మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి , టీడీపీ ఎంపీ కేశినేని నానిల మధ్య మాటల యుద్దం జరిగింది. తాజాగా శుక్రవారం నాడు “అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు”. అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా…దానిపై ఘాటుగా స్పందించిన కేసినేని నాని..తనకు కానీ, తన కుటుంబానికి గాని, తనకు సంబంధించిన వారికి కానీ అమరావతిలో ఒక్క అంగుళం భూమి ఉందని రుజువు చేస్తే ఆ భూమిని ప్రభుత్వానికి రాసి ఇస్తానని లేకుంటే ‘మీరేమి చేస్తారో కొంచెం చెబుతారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: