కోడెల…30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మాజీ స్పీకర్ , టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై వరుసగా పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఫర్నీచర్ చోరీ వ్యవహారం కోడెలకు తలనొప్పిగా మారగా…తాజాగా శుక్రవారం నాడు స్కిల్ డెవలప్ మెంట్ అధికారి బాజీబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కోడెలపై మరో కేసు నమోదుచేశారు. జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కు ల్యాప్‌టాప్ లు తీసుకొచ్చారు. అయితే ఈ సెంటర్ లో ఉన్న 30 ల్యాప్‌టాప్ లను కోడెల కుటుంబసభ్యులు తీసుకెళ్లారని శుక్రవారం నాడు స్కిల్ డెవలప్ మెంట్ అధికారి బాజీ బాబు సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ ఉన్నాయనే విషయమై ఆరా తీయనున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: