బర్త్ డే పార్టీకి పిలిచి…మహిళపై గ్యాంగ్ రేప్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

స్నేహం పేరుతొ నమ్మించి, పుట్టినరోజు వేడుకలకని పిలిచి సదరు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు మానవ మృగాలు…ఈ దారుణమైన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం…

మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి కి చెందినా అరుణ(42) కి సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగరెడ్డిపల్లి గ్రామానికి చెందినా గుర్రం బాలకిషన్ రెడ్డితో(45) గత తొమ్మిది ఏళ్లుగా పరిచయం ఉంది. అయితే గత మూడు రోజుల క్రితం బాలకిషన్ రెడ్డి దుండిగల్ ప్రాంతానికి తన బైక్ పై వెళ్లి అక్కడ తన పనులు చేసుకున్న తరువాత.. అరుణను కలిసి తన కుమార్తె పుట్టినరోజు ఉందని దానికి తప్పనిసరిగా రావాలని నచ్చచెప్పి ఆమెను వెంట పెట్టుకొని తీసుకెళ్లాడు..సిద్దిపేటకు చేరుకోగానే, గణేష్ నగర్ కాలనిలో ఒక రూమ్ కి తీసుకెళ్లి… అతని మిత్రులైన ప్రణీత్ రెడ్డి, రంజిత్ కుమార్ రెడ్డి(22)లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వాళ్ళను రప్పించాడు. వారు రాగానే అందరు కలిసి అరుణ పై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, మరుసటిరోజు ఆమెను పట్టణంలో వదిలి వెళ్ళగా బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు ముగ్గురి పై గ్యాంగ్ రేప్ నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: