అప్పుల బాధ…కారుపై, తనపై పెట్రోల్ పోసుకొని మరీ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్ళు తాళలేక తన బొలెరో వాహనంతో పాటు తాను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్న సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు పి.ఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే….అనంతపురం జిల్లా ఏ.నారాయణపురానికి చెందిన మసూద్ వలి నగరంలోని ఓ డెంటల్ క్లినిక్ లో టెక్నిషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల ఫ్లాట్ల వ్యాపారంలో బాగస్వామిగా ఉంటు ప్లాట్లు అమ్మకాలు, కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సుమారు రూ:50లక్షల దాక అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్ళు రావటంతో భరించలేక పెద్దవడుగూరు మండలంలోని అప్పేచెర్లలో నివాసముండే సమీప బంధువైన ఖాజామొదీన్ ఇంటిలో రెండు రోజుల పాటు ఉండిపోవటానికి వెళ్ళాడు. అయినా ఫోన్ ద్వారా తీవ్ర ఒత్తిళ్ళు రావడంతో మనస్తాపానికి గురై మండలంలోని కదరగుట్టపల్లి సమీపంలోకి వెళ్లి తన బొలెరో వాహనంతో పాటు తాను పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అయితే సమీపంలో పనులు చేస్తున్న కూలీలు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తీవ్ర గాయపాలైన మసూద్ వలిని 108వాహనం ద్వారా పోలీసులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తనకు అప్పు ఇచ్చిన సుబ్బరాయుడు,సుధాకర్, మీసాల శివ,చౌదరీ, రమణాలు డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెధిరించడంతో ఏమీ చేసేదిలేక ఈ అఘాయిత్యానికి పాల్పడిన నట్టు తెలిపాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: