కృష్ణుడిగా వర్మ…రాధగా శ్రీదేవి..వీడియో వైరల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటాడు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా వర్మ చాలా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు.. కృష్ణుడు అవతారంలో ఉన్న ఆర్జీవీ ఫ్లూట్ ఊదుతుంటే.. నీళ్ల కుండతో శ్రీదేవి ఆయన పక్కన నిలుచున్నట్లుగా రూపొందించిన చిత్రంతో ఈ వీడియోను రూపొందించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో జామురాతిరి జాబిలమ్మ పాట వస్తుండగా.. శ్రీదేవి డైలాగులు వినిపిస్తాయి. ‘‘మానవ నిన్నే మానవా?’’ అనే డైలాగ్‌తో ఆర్జీవీ మాటలను ఎడిట్ చేసి ఈ వీడియో రూపొందించారు. ‘‘దమ్ము కొట్టడం, రమ్ము కొట్టడం.. సిగ్గులేదు’’ అనే శ్రీదేవి డైలాగ్‌కు ‘‘అరవటం ఆగకపోతే ఇరగ్గొడతా’’ అనే ఆర్జీవీ డైలాగ్‌ను కలిపారు. చివరిగా ‘‘మానవా.. ఐ లైక్ యూ’’ డైలాగ్‌తో ఈ వీడియో ముగిసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: