శ్రీకాళహస్తిలో సిబ్బంది నిర్లక్ష్యం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి వాయులింగం‌ క్షేత్రంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆలయం వద్ద ప్రత్యేక తనిఖీ లతోపాటు… అదనపు బలగాలతో కూడా రక్షణ కల్పిస్తున్నారు…. అయితే కాళహస్తి దేవస్థానం ఆలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది…. నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. భద్రతాధికారులకు సహకరించక పోగా… ఆలయం లోపలికి సెల్ఫోన్లతో వెళ్తూ… నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు…. దీంతో కాళహస్తి ఆలయం వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి ఇబ్బందులు తప్పడం లేదు…. ఉద్యోగులకు ఎన్ని చెప్పినా…. వినడం లేదని… నిబంధనలకు విరుద్ధంగా… ఆలయం లోపలికి అడ్డదారిలో వెంట వచ్చిన భక్తులను దర్శనాల పేరుతో తీసుకెళ్లడమే కాకుండా…. సెల్ఫోన్లు సైతం ఆలయం లోపలికి తీసుకెళ్తున్నారని…. దీనివల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అభిప్రాయ పడుతున్నారు…. ఏది ఏమైనప్పటికీ టెంపుల్ ఈఓ స్థాయి అధికారులు కాళహస్తి ఆలయం భద్రతపై మరి కొన్ని చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు…

Share.

Comments are closed.

%d bloggers like this: