మరోసారి సత్తాచాటిన స్టోక్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆ ఇరు దేశాలకి ఇది ఒక చారిత్రాత్మకమైన పోరు. ఎవరు నేగ్గాలన్నా ప్రాణం పోయక తప్పదు… క్రికెట్ పుట్టుక మొదలు నుండి ఆ దేశాలు ఈ సీరీస్ ని ఒక యుద్ధంలా భావిస్తున్నాయి, అదే యాషెస్. ఆ ఇరు జట్లే క్రికెట్ కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్, మరొకటి తమ దేశానికి ఐదు సార్లు ప్రపంచ కప్ తెచ్చిపెట్టి క్రికెట్ చరిత్రలో తిరుగులేని ముద్ర వేసిన ఆస్ట్రేలియా. ఇప్పటికే 4 మ్యాచుల సీరీస్ తో ప్రారంభమైన ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలుచుకుంది మరొకటి డ్రా గా ముగిసింది. ఇక మిగిలినవి రెండు మ్యాచులే ఎవరు గెలవాలన్న నాలుగు మ్యాచులలో 2 గెలవక తప్పదు గెలుపే లక్ష్యంగా భావిస్తూ మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభించాయి ఇరు జట్లు. ఈ నెల 22న ఇంగ్లాండ్ లీడ్స్ వేదికగా ప్రారంభమైన మూడవ టెస్ట్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంటతో మొదలైంది అలాగే ముగిసింది. ఈ ఉత్కంతభరితమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలుపొంది సీరీస్ లో మళ్ళీ నిలదొక్కుకుంది.

ఈ మ్యాచ్ కి గాను ప్రస్తుత ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ తన సత్తా చాటుకున్నాడు ఆస్ట్రేలియా బౌలర్లకి పట్టపగలే చుక్కలు చూపించాడు. 135 పరుగులు చేసి తన జట్టుకి ఒక అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 219 బంతుల్లో 11×4, 8×6 లు బాది ఒక అద్భుతమైన శతకం చేశాడు. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన ఇంగ్లాండ్ 286 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పై ఆశలు కోల్పోయింది. బెన్ స్టోక్స్ మాత్రం మ్యాచ్ విజయం కీలకం అని భావించి తనదైన రీతిలో చివరి బ్యాట్సమెన్ లీచ్ తో కలిసి 73 పరుగులు ఛేదించాడు. ప్రతి బంతి ఉత్కంఠగా సాగింది ప్రతి ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసుకుంటూ తానే స్ట్రైక్ తీసుకొని ప్రతి ఓవర్ లో సిక్స్ లు, ఫోర్లు బాదుతూ తన సత్తా చాటుకున్నాడు బెన్ స్టోక్స్. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు.

చేసింగ్ లోఇంగ్లాండ్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు బర్న్స్ (7), జేసన్ రాయ్ (8) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌ చేరిపోయారు. అయితే.. కెప్టెన్ జోరూట్ (77: 205 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీ బాదగా.. అతనికి జోడెన్లీ (50: 155 బంతుల్లో 8×4) నుంచి చక్కని సహకారం లభించింది. దీంతో.. గెలుపు దిశగా సాగిన ఇంగ్లాండ్‌ జట్టుని హేజిల్‌వుడ్ (4/85) దెబ్బతీశాడు. మిడిల్ ఓవర్లలో క్రిస్‌వోక్స్ (1), జోస్ బట్లర్ (1), జానీ బెయిర్‌స్టో (36), జోప్రా ఆర్చర్ (15) వికెట్లు చేజార్చుకున్న ఇంగ్లాండ్ 286/9తో ఓటమికి చేరువైనట్లు కనిపించింది. కానీ.. బెన్ స్టోక్స్ మాత్రం ఓటమిని అంగీకరించలేదు శతకం సాధించినప్పుడు కూడా తాను సంతోషపడలేదు మ్యాచ్ గెలిచిన తరువాతే తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: