బట్టలు లాగేసి..జుట్టు కత్తిరించి…మేనల్లుడితో అఫైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అనుమానం ఒక పెను భూతం…అది ఒక్కసారి మొదలైతే తుడిచివేయటం చాల కష్టం అనే సామెతను మనం చాలాసార్లే వినివుంటాం…అచ్చం దీనికి సరిపోయెటువంటి దారుణ ఘటనే జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ వివాహితపై గ్రామస్థులు అనుమానపడ్డారు. ఆమెపై నీచమైన నిందలు వేయడంతోపాటు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఇంట్లో నుంచి బయటకు లాగి.. దుస్తులు చింపేశారు. అనంతరం ఆమె జట్టు కూడా కత్తిరించారు. దింతో ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే… కొడెర్మా జిల్లా డెంగోడిహ్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త మూడు నెలలుగా పని మీద నగరానికి వెళ్లాడు. భర్త లేని సమయంలో ఆమెకు సహాయం చేసేందుకు 22 ఏళ్ల తన మేనల్లుడు అక్కడికి వచ్చాడు. అయితే.. భర్తలేడని ఆ వివాహిత తన మేనల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పంచాయితీ పెద్దలు అనుమానించారు. ఆ మహిళను పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాగారు. అనంతరం ఆమె ఒంటిపై దుస్తులు లాగేసి ఆమె జుట్టును కత్తిరించారు. కాగా తన మేనల్లుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని… ఆ విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆ కోపంతో తన మేనల్లుడే తనపై చెడుగా పంచాయితీ పెద్దలకు చెప్పడని ఆమె వాపోతోంది. ఈఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివాహిత జుట్టును కత్తిరించిన ఘటనలో 11 మంది నిందితులను గుర్తించామని, దీనిపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని కొడెర్మా జిల్లా ఎస్పీ తమిళ్ వంజన్ చెప్పారు

Share.

Comments are closed.

%d bloggers like this: