ముఖ్యమంత్రి ఉన్నాడు అసలు.. ఆడవాళ్ల పుట్టుకనే అవమానిస్తాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నగిరి వైసీపీ ఎమ్మెల్యే రోజా నోరు జారారు అది కుడా ముఖ్యమంత్రి పైనే..! సాదారణంగా రాజకీయ నేతలు నోరు జారిన సందర్భాలు ఎన్నో చూసాము ఎందరో నేతలు నోరు జారడం మనం చూసాము, ఒక్కోసారి మంచి వక్తలు కుడా ప్రసంగాలు చేస్తున్నప్పుడు తడబాటులో నోరు జారుతుంటారు అయితే ఇదే క్రమంలో వైసీపీ ఏమ్మేల్యే రోజా కుడా నోరు జారారు. మంచి వక్తగా పేరున్న నేత రోజా ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ప్రసంగించిన ఆమె పొరపాటున నోరు జారారు.. ఇక ఇలాంటి సమయం గురించి ఎదురు చూస్తున్న తెలుగు తమ్ములు తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. ఆమె మాట్లాడిన విడియోని సామజిక మాధ్యమాల్లో పెట్టి తెగ హల్ చల్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో హాజరయిన రోజా మాట్లాడుతూ.. ‘కారు షెడ్డులో ఉండాలి. ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి పరిపాలనలో మహిళలకు ఏం న్యాయం జరుగుతుందో మనం అందరం చూశాం. ముఖ్యమంత్రి ఉన్నాడు అసలు.. ఆడవాళ్ల పుట్టుకనే అవమానిస్తాడు’ అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు.. ఇక ఆమె మాట్లాడిన విడియోని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియా సైట్లలో పెట్టి తెగ ట్రోల్ చేస్తున్నారు..
తెలుగు తమ్ముల్లే కాదు అక్కడ హాజరయిన కార్యకర్తలు కుడా రోజా మాటలకి కంగు తిన్నారు. తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. రోజా ఫ్లోలో అలా అనేశారని భావించారు. మరి రోజా ఉద్దేశం ఏంటో కాని ఇప్పుడు ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: