భర్త అడ్డోచ్చాడు..! అంతం చేయించిన భార్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వివాహేతర సంబంధాలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి.. అడ్డు ఎవరొచ్చిన వారిని తప్పించడమే వీరి ప్రధమ లక్ష్యంగా మార్చుకుంటున్నారు. భార్య, భర్త, తండ్రి, తల్లి ఇలా ఎవ్వరినీ లెక్క చేయడం లేదు. వాళ్ళని అడ్డు తప్పించే ప్రయత్నం లో ప్రాణాలని బంధాలని కుడా లెక్క చేయడం లేదు. ప్రాణాలు తీసేస్తున్నారు..! ఇలాంటి ఓ ఘటనే శ్రీకాకుళంలో చోటు చేసుకుంది. ప్రియుడి మత్తులో భర్తనే హంతం చేయాలని పథకం రచించింది ఓ పిశాచి భార్య.

వివరాల్లోకి వెళితే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించిందో భార్య. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం హైదరాబాద్‌కు కుటుంబంతో కలిసి వలస వచ్చాడు. శామీర్‌పేట మండలం బిట్స్ కాలనీలో నివసిస్తూ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు, ఒడిశా రాష్ట్రం..గజపతి నగరం జిల్లా గౌరీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా శామీర్‌పేట మండలం సింగాయిపల్లి గ్రామంలో ఉంటున్నాడు. వీరిద్దరికి స్నేహం కుదరడంతో అప్పుడప్పుడు మేస్త్రి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.

ఈ నేపథ్యంలో అతని భార్యకి ఒడిశాకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు వీలున్నప్పుడల్లా ఏకాంతంగా గడిపేవారు. ఈ విషయం మేస్త్రికి తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. తమ బంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన భార్య అతనిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఆమె ఒడిశా వ్యక్తికి రూ.5 వేల రూపాయలను ఇచ్చి తన భర్తని అంతం చేయవలసిందిగా కొరికింది. పథకం ప్రకారం ఈ నెల 14వ తేదీన మేస్త్రిని బైక్‌పై ఎక్కించుకున్న ఒడిశా వ్యక్తి… తూముకుంటలోని సత్యావైన్ వద్దకు వెళ్లి మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి స్థానిక సురభి వెంచర్‌ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మేస్త్రితో ఒడిశా వ్యక్తి.. పీకల దాకా తాగించాడు. అనంతరం మద్యం బాటిల్స్ పగులగొట్టి.. మత్తులో ఉన్న మేస్త్రి కడుపులో పొడిచాడు. చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత అక్కడి నుంచి జారుకుని ఒడిశాలోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 26వ తేదీన తూముకుంట బస్టాప్‌లో ఉన్న ఒడిశా వ్యక్తిని… మేస్త్రి భార్యను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: