‘అమెజాన్’ విలపిస్తుంది..! కాపాడండి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మానవ శరీరం నిలకడగా ఉండాలంటే తానూ పీల్చుకునే వాయువు స్వచ్చంగా ఉండాలి. మనం పీల్చుకునే గాలిని స్వచ్చంగా చేసేవి మన ఊపిరి తిత్తులు మనకి ఆక్సిజన్ ని అందజేసి కార్బన్ డై ఆక్సైడ్ ని వేరు చేస్తాయి..! కాని మనకి ఆకిస్జన్ ని ఇచ్చేవి మాత్రం వృక్షాలే, అందుకే సంస్కృతం లో వృక్షో రక్షతి రక్షతః.. అన్నారు పెద్దలు. మానవ శరీరంలో ఊపిరి తిత్తులు ఎలాగో ప్రకృతికి వృక్షాలు ఊపిరి తిత్తులు అలాంటివి. భుమికి వృక్ష సంపదలు అడవులు అలాంటి అడవులని మానవుడు తన అవసరాలకి దహించి వేస్తున్నాడు అడవులలో చెట్లని నరికి వేస్తున్నాడు.. ఒక పక్క మానవుడు అడవులని నరికేస్తుంటే ప్రకృతి మరో వైపు నుంచి అడవుల పై కాటు వేస్తుంది..! ప్రకృతి వైపరీత్యాల మూలానా అడవులలో అగ్ని ప్రమాదాలు సంభవించి అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం ఆక్సిజన్ ని అందించే అద్భుతమైన అడవి అమెజాన్. కాని ప్రకృతి ఈ అడవి పై తన పంజా విసిరింది తన అగ్నికి అమెజాన్ ఆహుతవుతుంది. ఎన్నో వన్య ప్రాణులు మృగరాశులు వృక్షాలు ఈ అగ్నికి ఆహుతవుతున్నాయి. అక్కడి గిరిజనులు భయాందోళనకి గురవుతున్నారు.! ఇంతకాలం ఈ అడవులు మానవాళికి ఏంతో మేలు చేసాయి.. ఇప్పుడు ఈ అడవి మానవాళి సహాయం ఆశిస్తోంది, ప్రతి ఒక్కరు ఈ అడవిని కాపాడటానికి ముందుకు రావాలి తమకి తోచిన విరాళం ఇవ్వాలి.

భూమాత ఊపిరితిత్తులుగా పేరుగాలంచిన అమెజాన్ అడవుల్లో రగిలిన కార్చిచ్చుపై హాలీవుడ్ హీరో ‘లియోనార్డో డికాప్రియో’ ఆవేదన వ్యక్తం చేశారు. అతిపెద్ద అడవిలో చెట్లు, వన్యప్రాణాలు కాలిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం ఆక్సిజన్ అందించే అడవులు కాలిపోవడంతో వాటి సంరక్షణ కోసం ముందుకు వచ్చారు. ఆయన ఇటీవల ఏర్పాటు చేసిన ‘ఎర్త్ అలయన్స్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా 5 మిలియన్ డాలర్లు ( రూ.36 కోట్లు ) విరాళం ప్రకటించారు. ప్రతి ఒక్కరు అడవుల సంరక్షణను చేపట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: