ఎక్కడ చూసినా..ఎప్పుడు చూసినా హౌస్‌ఫుల్‌..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రభాస్ ఇప్పుడు ఈ పేరు సంచలనం, తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగిపోతుంది. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇక బాహుబలి తరువాత అదే స్థాయి హిట్ కోసం ప్రభాస ఎంతగానో కష్టపడ్డాడు.. సాహో సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.. ప్రభాస్ సరసన బాలివుడ్ భామ శ్రద్ధా కపూర్, ప్రముఖ పాత్రల్లో జాకి ష్రాఫ్, నిల నితిన్ ముకేష్ లు కనపడనున్నారు. ఈ సినిమా ని రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు.

అత్యద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ట్రైలర్ ఇపాటికే విడుదలై సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచింది. ఈ సినిమా అనేక భాషల్లో ఈ నెల ౩౦ న ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇదో పండగ అనే చెప్పాలి ఎందుకంటే బాహుబలి తరువాత రెండేళ్లుగా సినిమా ని చిత్రికరిస్తూనే ఉన్నారు. ఇక టికెట్ల విషయానికొస్తే ఏ తియేటర్ చుసిన హౌస్ ఫుల్ అనే కనిపిస్తుంది. ఆన్ లైన్ లో టికెట్ లు కొనాలి అని చూసే ఫ్యాన్స్ కి టికెట్ లు చాల కష్టం మిద దొరుకుతున్నాయి. సాహో ప్రమోషన్ పనులు కుడా అద్భుతంగా జరుగుతున్నాయి. బాలివుడ్ ప్రముఖ ప్రసారాలలో ప్రభాస్ శ్రెద్ద లు తెగ హల చల్ చేస్తున్నారు. ఇవన్ని చూస్తుంటే సినిమా తప్పకుండ హిట్ కొట్టబోతుంది అని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: